ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులు తెలియ చేయాలి
అధికారులతో సవిూక్షలో సిఎస్ ఎస్‌కె జోషి
హైదరాబాద్,జూన్26(జనం సాక్షి): క్షేత్రస్థాయిలో వివిధ పథకాల అమలుకు చేస్తున్న సర్వేలు లేదా వివరాల సేకరణ విషయాలను డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి సూచించారు. క్షేత్ర స్ధాయిలో వివిధ శాఖల సిబ్భంది వద్ద అందుబాటులో ఉన్న ట్యాబులు, ఐపాడ్స్, సాప్ట్ వేర్ సమస్యలపై బేసిక్ సర్వేను నిర్వహించాలని కలెక్టర్లను కోరారు. గ్రామాలలో వ్యవసాయ,ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, బి.సి వెల్ఫేర్, రెవెన్యూ, తదితర శాఖల ద్వారా వివిధ అంశాలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్న పద్ధతులపై సవిూక్షించారు. రైతుబంధు పథకాన్ని వ్యవసాయ శాఖ ద్వారా ఏఈఓలు ట్యాబుల సహాయంతో పర్యవేక్షిస్తున్నదని తెలుపుతూ కెసిఆర్ కిట్స్, ఆరోగ్య లక్ష్మీ, స్కాలర్ షిప్ ల పంపిణీ, షాధీముబారక్, కళ్యాణ లక్ష్మీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్ధుల అడ్మిషన్లు, వారి ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి సేకరించే సమాచారం కలెక్టర్లు పర్యవేక్షించడంతో పాటు సంబంధిత కార్యదర్శులు సవిూక్షించేలా డ్యాష్ బోర్డు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2400 పైగా ఏఈఓల ద్వారా ట్యాబుల సహాయంతో గ్రామాలలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ, రైతుల గ్రూప్ ఇన్సూరెన్స్ వివరాల సేకరణ విజయవంతంగా అమలు చేస్తున్నందుకు వ్యవసాయ శాఖను అభినందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ డాష్ బోర్డు, మున్సిపాలిటీలలో కార్పోరేషన్లు చేపడుతున్నఅభివృద్ధి పనులు,ఓడిఎఫ్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖాధికారులతో సవిూక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యకార్యదర్శులు అర్వింద్ కుమార్, శాలినీ మిశ్రా, పార్ధసారధి, కార్యదర్శులు నవీన్ మిత్తల్, జగధీశ్వర్, బుద్ధప్రకాశ్ జ్యోతి, బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, మెట్రోవాటర్ వర్క్స్ యం.డి. దానకిషోర్, పంచాయతీ రాజ్ శాఖ కవిూషనర్ నీతుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ వివిధ కార్యదర్శుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నివేదిక రూపొందించాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ను ఆదేశించారు. ప్రస్తుతం వివిధ శాఖలలో డాటా సేకరణకు అవలంభిస్తున్న పద్ధతులను సవిూక్షించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సాంకేతికత సహాయంతో సమర్ధవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు సవిూక్షించుకునే అవకాశం ఉండాలన్నారు. వివిధ ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఫర్ ఫార్మెన్స్ ఇండికేటర్ల పై అధికారులు దృష్టి సారించాలన్నారు.
మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ రామగుండం, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందని, వీటి పనుల్లో వేగం పెరగాలని ఈ అంశాలపై ప్రతి 15 రోజుల కొకసారి జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కవిూషనర్లతో సవిూక్షించాలని కోరారు. /ుఙఈఎఆఅ ద్వారా వివిధ మున్సిపాలిటీలలో చేపట్టే పనులను గుర్తించి, డిపిఆర్ లు తయారు చేయడంతో పాటు అడ్మినిస్టేష్రన్, టెక్నికల్ శాంక్షన్లు తీసుకోని టెండర్లు పిలిచేలా చూడాలని, కలెక్టర్లు ప్రత్యేకంగా సవిూక్షించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 395 పనులను గుర్తించామని ఇవన్ని వివిధ దశలలో ఉన్నాయని అన్నారు. తమ పట్టణాలకు వచ్చే ఎంట్రీపాయింట్స్ వద్ద ఆర్చీలు, ట్రాఫిక్ జంక్షన్ల బ్యూటిఫికేషన్, బస్ బేలు, ఎస్ టి పి లు, గ్రేవ్ యార్డులు, డంప్ యార్డులు, స్లాటర్ హౌజెస్ తదితర పనులు చేపట్టాలన్నారు. ఇందుకు అవసరమైన ఆర్కిటెక్చర్లను నియమించుకోని డిజైన్లు రూపొందించాలని మున్సిపల్ కవిూషనర్ లను ఆదేశించారు. డంప్ యార్డుల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములను సేకరించాలన్నారు. జిహెచ్ యంసి కి సంబంధించి డంప్ యార్డుల నిర్మాణం కోసం రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి తదితర జిల్లాల్లో భూములను గుర్తించిన వాటి వివరాలు సంబంధింత కలెక్టర్లకు పంపించామని, ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ముఖ్యకార్యదర్శి కలెక్టర్లను కోరారు. కేందప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ టాయిలేట్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుందని, 86 శాతం కవరేజ్ సాదించారని, అక్టోబర్ 2 నాటికి రాష్ట్రమంతా ఓడిఎఫ్ లక్ష్య సాధన దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే 12 జిల్లాలు ఓడిఎఫ్ సాధించాయని, వచ్చే మూడు నెలల్లో మిగతా 18 జిల్లాలు ఇదేస్పూర్తి తో పనులు కోనసాగించి ఓడిఎఫ్ ను సాధించాలని కలెక్టర్లను కోరారు. టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం త్వరలోనే నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. టాయిలేట్ల నిర్మాణంలో వెనుకబడ్డ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
డ్యాష్‌బోర్డుకు అనుసంధానించేలా సమాచార సేకరణ




