Wednesday, 4 November 2026

ప్రతిష్టాత్మకంగా నాలుగో విడత హరితహారం

39 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా కార్యాచరణ
హైదరాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో 39 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి చెప్పారు. ఆయన అధ్యక్షతన సచివాలయంలో హరితహారం స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. సంబంధిత అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలు, శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యంపై సవిూక్షించారు. సీజన్‌ లో మొక్కలు నాటి వదిలేయకుండా, ఆయా శాఖలే వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సీఎస్‌ ఎస్కే జోషి కోరారు. మొక్కల ఎదుగుదల, బతికిన మొక్కల శాతంపై నెలవారీ నివేదికలు ఇవ్వాలని చెప్పారు. రైతులతో వెదురు, టేకు మొక్కల పెంపకాన్ని ప్రోత్సాహించాలని సూచించారు. హరితహారంలో పాల్గొనే ఉపాధి హావిూ కూలీలకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
———–