ప్రముఖ సింగర్ సిప్లిగంజ్
– తాగిన మైకంలో పోలీసులకు చుక్కులు చూపించిన సింగర్
– మద్యం సేవించి వాహనాలు నడిపిన 126మందిపై కేసు నమోదు
హైదరాబాద్, జులై28(జనం సాక్షి) : రంగస్థలం వంటి హిట్ సినిమాకు టైటిల్ సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ తప్పతాగి ట్రాఫిక్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. జూబ్లీహిల్స్‌లో పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ యాంకర్ లోబో ఓ కారులో వస్తుండగా పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. రాహుల్ సిప్లిగంజ్ కారుడ్రైవింగ్ చేస్తుండగా అతను మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే… తాను మద్యం సేవించలేదంటూ అతను పోలీసులతో వాగ్వావాదానికి దిగాడు. పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేస్తే 175 ఎంజీ వచ్చింది. కాగా… వారిద్దరు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు జూబ్లీహిల్స్‌లోని ఆయా వీధుల్లో కారుతో అతివేగంగా తిరుగుతూ హల్‌చల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా పూర్‌గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణెళిష్ వంటి ప్రైవేట్ ఆల్బమ్‌లతో రాహుల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే రంగస్థలం టైటిల్ సాంగ్ కూడా రాహుల్ సిప్లిగంజ్ పాడారు.
126మందిపై కేసులు..
మద్యం తాగి వాహనాలు నడిపిన 126 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లో పోలీసులు శుక్రవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై గుండా వెళ్లే వాహనాలను పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. కాగా… మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 126మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే 64 బైక్‌లు, 62 కార్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులకు పట్టుబడినవారికి సోమవారం పోలీసుల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ..




