హైదరాబాద్,ఫిబ్రవరి26(జనంసాక్షి): తన పై వచ్చిన డ్రగ్ ఆరోపణలను సినీ హీరో, ప్రముఖ గాయని గీతా మాదురి భర్త నందు ఖండించాడు. డ్రగ్ కేసులో ఇరుక్కొని పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో కుటుంబంతో సహా నందు పరారీలో ఉన్నట్లు కొన్ని టీవి ఛానెళ్ళు ప్రసారం చేశాయి. డ్రగ్ కేసులో తన ప్రమేయం లేదని, కొన్ని విూడియా ఛానెళ్లు అనవసరంగా, పనికి మాలిన కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఈ ఐస్ క్రీం ఫేం విూడియా ముందు వాపోయాడు. డ్రగ్ రాకెట్‌లో సినీ నిర్మాత సుషాంత్ రెడ్డి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అతనితో పాటు ఓ హీరోను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నైజీరియా దేశస్తుల నుండి డ్రగ్ కొనుక్కుంటుండగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. హీరో నందుకు ఈ డ్రగ్ రాకెట్‌లో ప్రమేయం ఉందని టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. అయితే తనకెలాంటి ప్రమేయం లేదన్నాడు. ఇవన్నీ తన ప్రతిష్టను దెబ్బతీసేవేనని అన్నారు.




