చిత్తూరు,ఫిబ్రవరి26(జనంసాక్షి): అటవీశాఖ చెక్ పోస్టులో అప్పగించిన పశువుల లారీ మాయమైన సంఘటనపై విచారణ సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించకున్నా దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. మదనప్లలె నుంచి చిత్తూరుకు కారులో ప్రయాణం చేస్తున్న ఆడిటర్ రాంబాబు ఎదురుగా వస్తున్న పశువులను తరలిస్తున్న లారీని వెంబడించి గంగవరం పోలీసుస్టేషన్ సవిూపంలోని అటవీశాఖ చెక్‌పోస్టు దగ్గర లారీని అడ్డుకున్నారు. ఆవులను కేరళ రాష్టాన్రికి తరలిస్తున్నట్లు గుర్తించి వెంటనే లారీని అక్కడే ఉన్న అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. గంగవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పోలీస్ కానిస్టేబుల్‌తో వచ్చేటప్పటికే లారీ మాయమైంది. కానిస్టేబుల్ సహాయంతో లారీని హెచ్‌పీ పెట్రోలు బంకు దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులోని పశువులు మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో పశువులను మరో వాహనంలో తరలించేశారని రాంబాబు వాపోయారు. వెంటనే లారీ డ్రైవర్ నుంచి రికార్డులు తీసుకుని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని చిత్తూరుకు బయలు దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం గంగవరం పోలీసులు వెళ్లడంతో ఒకే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. మరో కానిస్టేబుల్ పలమనేరు నుంచి రావడానికి కొంత సమయం పట్టింది. దీంతో లారీలోని పశువులు మాయమైనట్లు రాంబాబు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.




