Tuesday, 3 November 2026

డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

వరంగల్ ఈస్ట్, జూన్ 28(జనం సాక్షి):
 వరంగల్ నగరంలోని పోచమ్మ మైదానం లో  ఇసుక ట్రాక్టర్ ల డ్రైవర్ లకు ట్రాఫిక్ నిబంధనల పై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ మంగళవారం అవగాహన కల్పించడం జరిగింది .ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ లు మద్యం సేవించి వాహనాలు నడుపరదని ,ట్రాఫిక్ పోలీసులు సూచించిన స్థల లలో పార్క్ చేసుకోవాలని ,డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని రోడ్లపై ఇష్టం వచ్చినట్లు వాహనాలు నిలుపరదాని, ట్రాక్టర్ డ్రైవర్ లకు అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించవద్దని సిఐ తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎస్సై డేవిడ్, ఏ ఎస్సై ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు…