హైదరాబాద్, ఫిబ్రవరి 15( జనంసాక్షి ): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రానికి వివరించేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, రాష్ర్టానికి రావాల్సిన నిధులపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నారు.
ఢిల్లీ పర్యటనను ముగించుకొని మంగళవారం సాయంత్రం ముంబైకి బయలుదేరుతారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆయన భేటీ అవుతారు. ఈ భేటీలో సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా ఉన్న పలు అంశాలపై ‘మహా’సీఎం ఫడ్నవిస్‌తో కేసీఆర్ చర్చిస్తారు. అనంతరం తిగిరి బుధవారం హైదరాబాద్‌కు బయలుదేరుతారు.




