Tuesday, 3 November 2026

తక్షిణమే హైకోర్టును విభజించాలి – వినోద్‌

8హైదరాబాద్‌,జనవరి12(జనంసాక్షి): రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఏ విధంగా విభజించారో రాష్ట్ర హైకోర్టును కూడా అలాగే రెండుగా విభజించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బి.వినోద్‌ అన్నారు. విభజన తర్వాత మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో హైకోర్టులో కూడా అలాగే నడవాలన్నారు. హైకోర్టులో రెండు రాష్టాల్రకు వేర్వేరుగా భవనాలు కేటాయించి కోర్టు వ్యవహారాలు నడపాలని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌లో తాము చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పందించిందని ఎంపీ వెల్లడించారు. ఈమేరకు కేంద్ర మంత్రి సదానందగౌడ లిఖితపూర్వక హావిూ ఇచ్చారని వివరించారు. ఇదిలావుంటే ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలన దోపిడీమయమని ఆయన సోమవారమిక్కడ ధ్వజమెత్తారు. కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలన్న రైతులను చంపిన నరహంతకుడు బాబు అని కర్నె మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శ చేసే హక్కు లేదని ఆయన అన్నారు. సమస్యలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. ఇది ఓర్వలేకే కాంగ్రెస్‌, టీడీపీ నేతలు అర్థంలేని విమర్శులు చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ పాలకుల నిర్వాకం వల్లే మురికివాడలు అలాగే ఉండిపోయాయని తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ నేతలు జోకర్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మెప్పు పొందేందుకే టీటీడీపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలను చంద్రబాబు నరకయాతన పెట్టిండు. టీడీపీకి అధ్యక్షులయ్యేందుకే పోటీపడి ఎర్రబెల్లి, రేవత్‌లు మాట్లాడుతున్నారని తెలిపారు. మా హక్కులను ఎందుకు అడ్డకుంటున్నారని తెలంగాణ ప్రజలు చంద్రబాబును గల్ల పట్టుకుని అడిగే రోజు వస్తదని హెచ్చరించారు. పొన్నాల.. కళ్లుండి చూడగలిగితే… చెవులుండి వినగలిగితే సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఏం చేస్తున్నారో తెలుస్తుందన్నారు. సమస్యలు ఇలాగే ఉన్నందుకు కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *