హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూతో 41 మంది మృతి చెందారని పేర్కొంది. శుక్రవారం ఒక్క రోజే 90 నమూనాలు పరిశీలించగా, 30 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని స్పష్టం చేసింది. స్వైన్‌ఫ్లూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే స్వైన్‌ఫ్లూను ఆరికట్టవచ్చని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.




