Tuesday, 3 November 2026

మిషన్‌కాకతీయపై హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : సచివాలయంలో మిషన్ కాకతీయపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెలాఖరు వరకు 20 శాతం చెరువుల అంచనాల తయారీ పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెండర్లు పిలవడంలో జాప్యంపై ఇంజినీర్లను మంత్రి ప్రశ్నించారు. టెండర్లు పిలవడంలో ముందున్న వరంగల్ జిల్లా ఎస్‌ఈకి అభినందనలు తెలిపారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదార్లు 5 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఐదు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే టెండర్లు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూడిక మట్టి తరలింపుపై ప్రయోజనాలను రైతులకు వివరించాలని అధికారులకు మంత్రి చెప్పారు.ఈ ఏడాది పనులు చేపట్టే చెరువులు 9,662. సర్వే పూర్తి అయిన చెరువులు 7,212. అంచనాలు పూర్తైన చెరువులు 5,635. పరిపాలన అనుమతులు లభించిన చెరువులు 2,569. టెండర్లు పిలిచిన చెరువులు 1,143.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *