Tuesday, 3 November 2026

వినోదం పన్ను చెల్లించాల్సిందే : జీహెచ్‌ఎంసీ

హైద‌రాబాద్ జ‌నంసాక్షి ; హైదరాబాద్ నగరంలోని సినిమా హాళ్ల యాజమాన్యాలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సమావేశమయ్యారు. వినోదం పన్ను చెల్లించాల్సిందేనని సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇక నుంచి వినోదం పన్ను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. మార్చి 1 నుంచి ఆన్‌లైన్ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. ప్రభుత్వాలు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్స్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఆస్తి పన్ను చెల్లింపుపై థియేటర్లలో ైస్లెడ్‌లు వేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *