– మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్, మే5(జనం సాక్షి ) : రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తడిచిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హావిూ ఇచ్చిన దృష్ట్యా… పౌరసరఫరాల శాఖ అధికారులందరూ తక్షణమే వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాలను సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనకపోయినా సరైన మద్ధతు ధర అందకపోయినా అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు హైదరాబాద్ పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే రైతులు నేరుగా 7330774444 నంబరుకు ఫోన్ ద్వారా లేదా వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
తడిచిన ప్రతి గింజా కొనుగోలు చేస్తాం




