Thursday, 5 November 2026

తన ప్రతిష్ట దెబ్బతీయడానికే వైకాపా ఆరోపణలు: యరపతినేని

గుంటూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): సరస్వతీ భూముల విషయంలో తాను రైతులకు అండగా ఉన్నందుకే జగన్‌ తనపై కక్ష కట్టారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ ఆరోపించారు. గురువారం విలేకరులతోమాట్లాడుతూ.. వైసిపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడులో 25 వేల మంది క్వారీ కార్మికులు రోడ్డున పడింది వైసిపి వల్లేనని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై వైసిపి కుట్ర చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ప్రజల సమక్షంలోనే వైసిపి సంగతి తేలుస్తామని మండిపడ్డారు. వైసిపి నిజ నిర్ధారణ కమిటీలో అందరూ దోపిడీ దొంగలేనని యరపతినేని దుయ్యబట్టారు.

—————–