తప్పును కప్పిపుచ్చుకోవాలనేదే బీజేపీ అజెండా

 

– వైసీపీ, బీజేపీలు కలిసి డ్రామాలాడుతున్నాయి

– ఏపీకి జరిగిన నష్టాన్ని దేశమంతా తెలిసేలా తిరుపతి సభ నిర్వహిస్తాం

– ఏపీ మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు

తిరుపతి, జ‌నం సాక్షి ) : రాష్టాన్రికి అన్యాయం చేసిన కేంద్రంపై టీడీపీ పోరాటం చేస్తుంటే వైసీపీ శత్రువుకి సహకరిస్తుందని ఏపీ మంత్రి అమర్‌ నాథ్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా నమ్మించి మోసం చేసిన ప్రధాని మోదీ గురించి మాట్లాడుతున్నామని, ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే వైసీపీ వైజాగ్‌లో చేస్తున్న దీక్ష అని ఆరోపించారు. వెంకన్న సాక్షిగా మాటిచ్చి, మోసం చేసిన వైనాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని మరో మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. నిన్న బీజేపీ నేతలు తిరుపతిలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి, టీడీపీపై కొన్ని ప్రశ్నలు సంధించారు. దీనిపై స్పందించిన అమర్‌ నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ అవి అర్థం పర్థం లేని ప్రశ్నలని అన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనేదే వాళ్ల ప్రధాన అజెండా అని మంత్రి విమర్శించారు. రాష్టాన్రికి విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీ కంటే బీజేపీ, మోదీ ఎక్కువ ద్రోహం చేశారనే ఆలోచనతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని అమర్‌నాథ్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రజలను తప్పుదోవ పట్టించాలనేదే బీజేపీ ప్రధాన ఉద్దేశమని ఆయన విమర్శించారు. దానికి అనుగుణంగానే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌, ప్రశ్నలు సంధించారని మంత్రి విమర్శించారు. వైసీసీ కూడా ఆ విధంగానూ వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఈ సభ ద్వారా ఏపీకి ఏ విధంగా నష్టం జరిగిందీ.. భారత దేశం అంతటా తెలిసేలా తిరుపతిలో సభ నిర్వహిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

తాజావార్తలు