తలనీలలాలు సమర్పించుకున్న సీఎం కిరణ్
తిరుమల : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి జైరాం రమేష్ శనివారం కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కినప్పుడు తలనీలాలు సమర్పించుకున్న ముఖ్యమంత్రి… ఈ సారి కూడా వెంకన్నకు తలనీలాలు ఇచ్చారు.



