తల్లిదండ్రుల సరదా… ఆ పాప ప్రాణం తీసింది!
లండన్: తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను ‘గాలి’లో కలిపేసింది. పెనుగాలుల కారణంగా ఆ చిన్నారి తీవ్ర గాయాల పాలై మరణించింది. లండన్‌లోని ఓ పార్కులో జరిగింది ఈ ఘటన.
సరదాగా కాలక్షేపం చేయడం కోసం తమ చిన్నారిని వెంట పెట్టుకుని పార్క్‌కు వచ్చింది ఓ జంట. ఆ పార్క్‌లోనే ఓ డేరా ఏర్పాటు చేసి ఆ పాపను పడుక్కొబెట్టారు. అనంతరం వారిద్దరూ సరదాగా ఆ పార్క్‌లో తిరగడానికి వెళ్లారు. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్నట్టుండి పెనుగాలులు వీయడం మొదలెట్టాయి. దీంతో ఆ డేరాలతో వేసిన గుడిసే పాపాతోబాటే దాదాపు 150 అడుగుల దూరం వరకు ఎగిరిపోయింది. దీంతో ఆ పాప తీవ్ర గాయాలపాలయ్యింది. అంబులెన్స్‌ను పిలిచి ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో ఉండగానే ఆ బాలిక మరణించింది. దీంతో ఆ పాప పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.