తిరుమల : అన్నమయ్య భవన్‌లో తితిదే పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో సుమారు రూ. 2,500 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తితిదే ఇంజినీరింగ్ విభాగానికి అధికమొత్తంలో నిధులు కేటాయించనున్నారు. 65 ఏళ్లకు అర్చకుల ఉద్యోగ విరమణ అంశంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.




