తిరుగులేని పార్టీ బీఆర్ఎస్ : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని త్వరలో దేశంలోనే తిరుగులేని పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అవతరించనుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి జోస్యం చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రూప్ ఖాన్ పేట్, కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేశారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలను నిజమైన అర్హులకు అందజేస్తూ సుసంపన్న పాలనను అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసి ప్రజలకు మౌళిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల లబ్ది ప్రతి ఇంటి తలుపుతట్టాయన్నారు. అందుకనే ఇతర పార్టీల నుంచి స్వచ్చందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎంపీపీ కరణం అరవింద్ రావ్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సయ్యద్ పల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
26 పిఆర్ జి 01లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్,బీజేపీ నాయకులు