Tuesday, 3 November 2026

తిరుమలలో తగ్గని రద్దీ

తిరుమల,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. వరుస సెలవులకుతోడు కార్టీక సోమవారం, నాగులచవితి కూడా కలసి రావడంతో రద్దీ కొనసాగింది. 1,00,872 మంది భక్తులకు నిన్న శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. నిన్న 37,856 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు 2.32కోట్లు.