తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..
మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు
తిరుపతి, ఆగస్టు2(జనం సాక్షి) : తిరుమల శ్రీవారిని మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్యలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మంత్రి కొడుకు హిమన్షును స్వామివారి పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.