Thursday, 5 November 2026

తూర్పులో కార్తీక శోభ

కిటకిటలాడిన ఆలయాలు

కాకినాడ,నవంబర్‌12(జ‌నంసాక్షి): కార్తీకంతో జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి కార్తీక సోమవారం పురస్కరించుకుని పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాదగయ పుష్కరనిలో స్నానలు చేసి కార్తీక దీపాలను భక్తులు వదిలారు. సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజామునే స్నానాలు చేసి భక్తిశద్దలతో శివుని ఆరాధిస్తున్నారు. జిల్లాలో ప్రసిధ్ద శైవక్షేత్రమైన ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచి రత్నగిరిపై కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున 2 గంటల నుండి వ్రతలు, 4 గంటల నుండి సర్వ దర్శనాలను దేవస్థానం అధికారులు అందుబాటులోకి తెచ్చారు.