గుంటూరు,నవంబర్12(జనంసాక్షి): సానుభూతి కోసం జగన్ తల్లి విజయలక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నారన్నారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. విజయలక్ష్మి ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కోడికత్తి డ్రామా రక్తికట్టలేదని విమర్శించారు. గంటసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోయే గాయానికి రాజకీయం చేశారని మండిపడ్డారు. జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తున్నారని..ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేకపోతే తెలంగాణ పోలీసులను తెచ్చుకోవాలని మంత్రి నక్కా ఆనందబాబు హితవు పలికారు. అయినా ప్రభుత్వం తన బాధ్యతగా పోలీస్ రక్షణ ఏర్పాటు చేసిందన్నారు.




