Tuesday, 3 November 2026

తెలంగాణకు హైదరాబాద్‌ ఆర్థికశక్తి : మంత్రి కేటీఆర్‌

636183472266929306హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ ఆర్థికశక్తి అని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకే కృషిచేస్తున్నామని అన్నారు. సోమవారం అసెంబ్లీలో బీజేపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సమస్యల పరిష్కారానికి 100 రోజుల ఎజెండా రూపొందించామని, 100 రోజుల ఎజెండాలో ఎన్నో హామీలు నెరవేర్చామని చెప్పారు. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ తీసుకొచ్చామని, పెట్రోల్‌ బంకుల్లో పబ్లిక్‌ టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. త్వరలో బిల్డింగ్‌ ట్రిబ్యునల్‌ తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సాయం కావాలని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల కోసం రూ.900 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నామన్నారు. వర్ష200 వాటర్ లాగింగ్ పాయింట్స్‌ను గుర్తించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *