తెలంగాణపై ప్రత్యేకంగా పోస్టల్‌ కవర్‌

హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): తెలంగాణలో భౌగోళిక గుర్తింపు కలిగిన ఐదు అంశాలపై ఇండియన్‌ పోస్టల్‌ తెలంగాణ సర్కిల్‌ ప్రత్యేక కవర్లను ముద్రించింది. ఈ స్పెషల్‌ కవర్లను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం ఆవిష్కరించారు. నిర్మల్‌ ఫర్నిచర్‌, నారాయణపేట చేనేత చీరలు, వరంగల్‌ దరీలు, హైదరాబాద్‌ హలీం, సిద్దిపేట గొల్లభామ చీరల ప్రత్యేకతలపై ఈ కవర్లు ప్రచురించడం అభినందనీయం అని గవర్నర్‌ ఈ సందర్భంగా ప్రశంసించారు.