Friday, 6 November 2026

తెలంగాణలోనూ కర్నాటక తరహా ఫలితాలు :దత్తన్న

హైదరాబాద్‌,మే15(జ‌నం సాక్షి ):  కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త మలుపని బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న సందర్భంగా స్పందించిన ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీకి ప్రజాదరణ తగ్గలేదని నిరూపితమైందన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పదని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో  బీజేపీ పాగా వేస్తుందని బీజేజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ఇక్కడ కెసిఆర్‌ చెబుతున్న మాటలు నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు. అలాగే పథకాలను కాపీ కొట్టాల్సిన ఖర్మ బిజెపికి పట్టలేదన్నారు.