తెలంగాణలో ఉత్తమ పోలీసింగ్ వ్యవస్థ అమలవుతోంది
– పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ బాగుంది
– కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం
– పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్18(జనంసాక్షి) : తెలంగాణలో ఉత్తమ పోలీసింగ్ వ్యవస్థ అమలవుతోందని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అన్నారు. మంగళవారం భారతదేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా స్థానం సంపాదించిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకొని పోలీసులు సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. మహిళలపట్ల నేరాలు తగ్గాయని, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. స్మార్ట్ పోలీసింగ్ అనేది ప్రధాని ఆకాంక్ష అని వివరించారు. ఠాణాలోని సదుపాయాలను పరిశీలించారు. తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. షీ టీమ్‌ల ఏర్పాటు చాలామంచి ప్రయత్నమని అభినందించారు. నేరాల నియంత్రణ కోసం ప్రస్తుతం తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న విధానాలు మంచి ఫలితాలిస్తున్నాయని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టెక్నాటజీ సాయంతో కేసులను చేధిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని పోలీకస్ స్టేషన్లని ఆధునికరిస్తాం అని మహేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అంజనీకుమార్, పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట ఎసీపీ విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.