
హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.రాంచందర్‌రావు హైదరాబాద్ తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎర్రబెల్లి రామ్మోహనరావు వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసనమండలి ా’య్రర్మన్ స్వామ్ణిొడ్ రాజేంద్రనగర్‌లో, రంగారెడ్డి జిల్లా తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు




