Saturday, 7 November 2026

తెలంగాణలో నిరంకుశ పాలన

ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కిన టిఆర్‌ఎస్‌

మండిపడ్డ మాజీ ఆర్థికమంత్రి చిదంబరం

హైదరాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కేంద్రంలో భాజపాను, రాష్ట్రంలో భాజపా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తెరాసను ఓడించడం ప్రస్తుతం అత్యావశ్యకమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కి ఈ ప్రాంత ప్రజలను అణచివేస్తోందని అన్నారు. ఆ రెండు పార్టీలూ నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం ఆయన

హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నీ ఏమయ్యాయని తెరాసను ఆయన ప్రశ్నించారు. తమ నిరంకుశ పాలనను కాపాడుకొనేందుకు తెరాస భాజపాను విమర్శించడం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను కేసీఆర్‌ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారని.. ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. ఒకవేళ పంపిణీ భూ పంపిణీ చేస్తే వాటి వివరాలను ఆధార్‌ కార్డులతో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. తెరాస సర్కార్‌ 2.20 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ఆ మొత్తం ఏమైందని నిలదీశారు. ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు, రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం హావిూలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తన గుండెల్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పిన చిదంబరం డిసెంబర్‌ 9, 2009న తాను చేసిన చరిత్రాత్మక ప్రకటనను మరిచిపోలేనన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.