Saturday, 7 November 2026

తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వాన్ని నూకలు చెల్లు

ఓ వక్తి కోసం తెలంగాణ బలయ్యింది
అన్ని పార్టీలతో కలసి ప్రజల కోసం బయలుదేరాం
ఇక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం
మేడ్చెల్‌ సభలో రాహుల్‌ గాంధీ సంచలన ప్రకటన
మేడ్చెల్‌,నవంబర్‌23(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెదించబోతున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని పార్టీలతో కలసి ముఏందుకు సవ్తున్నామని, కెసిరా/- నిరంకుశ పానలకు చరమగీతం పాడుతున్నామని అన్నారు. రాక్షస రాజ్యాన్ని, దొర గడీని కూల్చేందుకే అంతా కలిసి జట్టు కట్టామనిరాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణ జనసమితి, టిడిపి, సిపిఐలతో కలసి వస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని మేడ్చల్‌ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై సోనియాగాంధీకి ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల కోరికలు సఫలీకృతం కావాలనే ఆమె అండగా నిలిచారన్నారు. అన్ని వర్గాల ప్రజలు రక్తమోడ్చి పోరాడితేనే తెలంగాణ కల సాకారమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా ఇక్కడికి వచ్చి తన ప్రజల పట్ల తన ఆకాంక్షను చాటారన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేస్తున్నప్పుడు సోనియా ప్రజల పక్షాన నిలబడ్డారని చెప్పారు. తెలంగాణ ప్రజలు రక్తమోడ్చి, చమటోడ్చి పోరాడితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రజల పోరాటాలతో పాటు సోనియా పాత్ర కూడా అనిర్వచనీయమైందని గర్వంగా చెబుతున్నా నన్నారు. అయితే ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఓ వ్యక్తి తన కుటుంబం కోసం తెలంగాణను వనరుగా  చేసుకున్నారని మండిపడ్డారు. అందుకే తెలంగాణలో నాలుగున్నరేళ్ల తెరాస రాక్షస పాలనకు చరమగీతం పాడబోతున్నామన్నారు. రాక్షస రాజ్యాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెస్‌తో పాటు తెదేపా, సీపీఐ, తెజస అన్నీ కలిసి వచ్చాయన్నారు. తమ ప్రజాఫ్రంట్‌లో విద్యార్థులు, రైతులు, మహిళల ఆకాంక్షలు కనబడుతున్నాయని చెప్పారు. ఏ కలల కోసం ప్రజలు కొట్లాడారో ఆ కలలను సాకారం చేయడమే తమ కూటమి లక్ష్యమన్నారు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ సాధించుకున్నారో అవి నెరవేరలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల అందరికీ మేలు జరుగుతుందని భావిస్తే.. ఒకే కుటుంబం లాభపడిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేసింది కాదన్నారు. లక్షలాది నిరుద్యోగుల కష్టాలు
తీర్చేందుకే మహాకూటమి ఏర్పాటైందని చెప్పారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రజా కూటమి పాలన ఉంటుందని రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారు.