10.4 శాతం పారిశ్రామిక వృద్ధి : కెటిఆర్
హైదరాబాద్,జూన్4(జనం సాక్షి):తెలంగాణ పారిశ్రామిక వృద్ధి పెరిగిందని తెలిపారు. మంత్రి కేటీఆర్ అన్నారు. 2017-18లో 10.4 శాతం తెలంగాణ పారిశ్రామిక వృద్ధి పెరిగిందని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,23,478 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పెట్టుబడుల ద్వారా 5 లక్షల 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 55 శాతం అధికంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని పార్క్ ¬టల్‌లో 2017-18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యదర్శిజయేశ్ రంజన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ఉత్తమ కంపెనీలకు పారిశ్రామిక అవార్డులను కేటీఆర్ అందజేశారు. పలు కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో తీసుకుంటున్న చర్యలు గణనీయమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. ఇదంతా కూడా సానుకూల ధోరణఱి కారణంగా వస్తున్న ప్రగతి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికరంగ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 2017-18లో తెలంగాణ పారిశ్రామిక వృద్ధి 10.4 శాతం పెరిగిందన్నారు. టీఎస్ ఐ-పాస్ ద్వారా రూ.లక్షా 23 వేల 478 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వీటితో 5.27 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో తొలిస్థానంలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం లక్షా 75 వేల 534 రూపాయలని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 55 శాతం అధికమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ట్విట్టర్ ద్వారా స్పందన
భవన నిర్మాణాలు, ఇతర పనుల కోసం తవ్వకాలు, మట్టి తరలింపు నిర్ణీత సమయంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. తవ్వకాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గచ్చిబౌలిలో నివసిస్తున్న బృంద ప్రసాద్ ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదుపై మంత్రి స్పందించారు. తన ఇంటి పక్కన రోజూ తెల్లవారుఝామున 5.50 గంటలకే భవన నిర్మాణం కోసం తవ్వకాలు, మట్టి తరలింపు జరుగుతోందని, కొంతకాలంగా ఈ పనులు చేస్తుండడంతో ఇబ్బందికరంగా మారిందని తెలిపాడు. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ట్విటర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి పైవిధంగా స్పందించారు.




