నిజామాబాద్,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ కన్నా తెలంగాణ యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పీడిఎన్‌యూ నాయకులు ఆరోపించారు. అన్ని రకాల ఫీజుల్లోనూ అధికమోత్తం వసూలు చేస్తున్నారని వారు విమర్శించారు. అసలే బడుగు, బలహీన, పేద, గ్రావిూణ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్న తెలంగాణ యూనివర్సిటీలో ఫీజులను ఎక్కువగా ఉండడం వారి భవిష్యత్తుకు ఆటంకం అవుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌ఎల్‌బీతో పాటు పలు కోర్సులకు సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదని ఆరోపించారు. స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాన్వొకేషన్ ఫీజులను సైతం ఎక్కువగా తీసుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని పీడిఎస్‌యూ నాయకులు ఇన్‌చార్జి వీసిని కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. అలాగే భద్రత కోసం క్యాంపస్‌లో పోలస్‌స్టషన్, ఆరోగ్యకేంద్రం విద్యుత్తు సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




