Tuesday, 3 November 2026

బీడికార్మికులందరికీ జీవనభృతి అందించాలి

నిజామాబాద్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): బీడీ కార్మికుంలందరికీ జీవనభృతి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలు కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బీడి కార్మికులకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు జీవనభృతి చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. భేషరతుగా ఎలాంటి కొర్రిలు పెట్టకుండా బీడీ కార్మికులందరికీ పథకం వర్తింపజేయాలన్నారు. అనవసరమైన ఆంక్షలతో కేవలం కొందరికి మాత్రం జీవనభృతి ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తుందని, ఇది సరికాదని బీడికార్మిక సంఘం జిల్లా నాయకులు సిద్దిరాములు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *