అక్రమాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: పొన్నాల
టిఆర్‌ఎస్ ఏజెంట్‌గా గవర్నర్: విహెచ్
హైదరాబాద్,జనవరి3(జనంసాక్షి): తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని కోరారు. మొన్నటి ఎన్‌ఇనకల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు అని తప్పుపట్టారు. జరిగిన పొరపాట్లపై స్పందించడం లేదన్నారు. పోలింగ్ అయిన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా ఉందన్నారు. వీటన్నింటిపై విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయని అన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భజన చేస్తున్న గవర్నర్ నరసింహన్‌ను వెంటనే మార్చాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్
చేశారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ గవర్నర్ టీఆర్‌ఎస్ ఏజెంట్‌గా పని చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై కేంద్ర ¬ంమంత్రిని కలిసి గవర్నర్‌పై ఫిర్యాదు చేస్తామన్నారు. బీసీలంతా ఏకమై.. పంచాయతీ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆర్డినెన్స్ తెచ్చి బీసీలకు అన్యాయం చేశారని వీహెచ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లపై కోర్టును సాకుగా చూపి ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. అధికారులు కండువాల్లేని టీఆర్‌ఎస్ కార్యకర్తలుగా మారారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా రిజర్వేషన్ చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు అధికారులు రిజర్వేషన్లను గిప్ట్‌గా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దళితులు కావాల్సిన చోట ఇతరులకు రిజర్వేషన్లు ప్రకటించారన్నారు. కరీంనగర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని జీవన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో రాఫెల్‌పై ఏ ఒక్క ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ అనుభవం లేని అంబానీకి ఎలా కట్టబెట్టారంటే మోదీ మౌనం వహిస్తున్నారని అన్నారు. మోదీది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాదని ..అంబానీ, ఆదాని ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. రాఫెల్‌పై మోదీ జేపీసీ ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తెలియదని మోదీ అనడం పెద్ద జోక్ అన్నారు. ప్రజాకూటమి ఓడిందన్న మోదీకి…బీజేపీ ఫలితాలు తెలియవా? అని అడిగారు. మోదీ, కేసీఆర్ క్షుద్ర రాజకీయాల వల్లే బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు రాలేదని శ్రవణ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి




