విశాఖపట్నం: తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో నైరుతి బుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతవరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కోస్తాంధ్రా, రాయల సీమ అంతటా నైరుతు రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించినట్లేనని వాతావరణ శాఖ పేర్కోంది. వీటికి తోడు ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కోనసాగుతున్నాయి. వీటి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వానలు, లేక ఉరుములతో కూడిన జల్లులు కురిసూ అవకాశం ఉందనా విశాఖ హెచ్చరికల కేంద్రం తెలిపింది. గడచిన 24 గంటల్లో కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలొ అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, జగిత్యాలలో 4, ముధోల్, అరకువ్యాలీలో 3, గోల్కొండ, ఏటూరు నాగారం, నిజామాబాద్, హూజూరాబాద్‌లో 2, సాలూరు, నర్సీపట్నం, లక్సెట్టిపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వనపర్తి, ఖానాపూర్, కరీంనగర్, హన్మకొండ, పాకాల, ముథోల్‌లలో 1 సెంటీ మీటరు చొప్పున వర్షపాతం నమోదైంది.




