గజ్వెల్ ఘటనలే ఇందుకు నిదర్శనం
కెసిఆర్ పాలనకు చరమగీతం పాడాలి
విూడియాను నియంత్రిస్తున్న తీరు దారుణం
విూట్‌ద ప్రెస్‌లో ఉత్తమ్ వ్యాఖ్యలు
హైదరాబాద్,నవంబర్27(జనంసాక్షి): తెలంగాణలో అరచాక పాలన సాగుతోందని, అందుకు గజ్వెల్ కాంగ్రెస్ అభ్‌ర్థి వంటేరు ప్రతాపరెడ్డికి వేదింపులు, దాడులే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరచాక పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్నదని అన్నారు. నరేంద్ర మోదీకి కేసీఆర్ అమ్ముడు పోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలోని అన్ని వర్గాలను.. కేసీఆర్
కుటుంబం అవమానపర్చిందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విూట్ ది ప్రెస్‌లో మాట్లాడిన ఉత్తమ్.. చాలా చిన్న వయసులో దేశ రక్షణ కోసం పనిచేశానని.. ఆ స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. 2014లో దురదృష్టవశాత్తు కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి భ్రష్టుపట్టించారని విమర్శించారు. మోదీ, కేసీఆర్ బరితెగించి విూడియాపై ఒత్తిడి తెస్తున్నారని.. అబద్దాలు చెప్పినా పత్రికల్లో మొదటి పేజీల్లో వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్‌ది బ్రోకర్ బతుకు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం సోనియా కుటుంబానిది అని, ఇచ్చిన మాటను నీరుగార్చే తత్వం కేసీఆర్‌ది అని విమర్శించారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణలో ఎవరి జీవితాలను బాగుపర్చలేదన్నారు. కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణ శాశ్వతంగా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, ఫ్రీడం ఆఫ్ ప్రెస్ స్వాతంత్యాన్రంతరం మన దేశంలో తప్ప ఎక్కడా లేదు కానీ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అణచివేత మొదలైందని వ్యాఖ్యానించారు. వరంగల్ సభలో సీఎం కేసీఆర్ చిల్లరగా విూడియాను 10 కిలోవిూటర్ల లోతుకు తొక్కుతా అన్నాడని గుర్తు చేశారు. ఇప్పుడు విూడియాకు అవకాశం వచ్చిందని, కేసీఆర్ కుటుంబాన్ని 10 కిలోవిూటర్ల లోతుకు తొక్కేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ విూడియా యాజమాన్యాలకు ఫోన్ చేసి వార్తలు ఇలా రావాలి అలా రావాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎం, మంత్రులు ఎప్పుడైనా అలా చేశారా అని ప్రశ్నించారు. మమ్మల్ని కేసీఆర్ తిడితే బ్యానర్లు పెట్టారని, అదే తాము తిడితే విూడియా అసలు పట్టించుకోలేదని చెప్పారు. విూడియా సంస్థల యాజమాన్యాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ అందరినీ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నువ్వూ, నీ కుమారుడు, నీ బిడ్డనే తెలంగాణా వాళ్లా? మిగిలిన వాళ్లు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఎవరిని అడిగి రూ.వందల కోట్లతో ఇళ్లు కట్టావు..ఖరీదైన కార్లలో తిరుగుతున్నావని సూటిగా అడిగారు. సోనియా గాంధీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన నెహ్రూ కుటుంబం విూ కంటే ఎంతో సాధాసీదాగా బతుకుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ 15 ఏళ్లుగా ఎంపీగా ఉన్నా ప్రధాని కాలేదు..ఇందిరా, రాజీవ్‌లు ఎలా చనిపోయారు తెలుసుగా..అలాంటి కుటుంబంపై కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని దుయ్యబట్టారు. ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మండల స్థాయి రిపోర్టర్ నుంచి ప్రతి జర్నలిస్టుకు అన్నిరకాల మౌళిక వసతులు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టి ఘోరీ కట్టే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.




