Wednesday, 4 November 2026

తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

రాష్ట్ర గీతంగా జయజయహే గీతం
ఒకే దఫా 2లక్షల రైతుల రుణమాఫీ
కౌలురైతులకూ రైతుబంధు పథకం వర్తింపు
ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ
నిరుద్యోగులకు మూడువేల భృతి
అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ
గాంధీభవన్‌లో విడుదల చేసిన జైరామ్‌ రమేశ్‌, కుంతియా,ఉత్తమ్‌ తదితరులు
హైదరాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. 37 అంశాలతో కూడిన ఈ మ్యానిఫెస్టోలో జయజయహే గీతాన్ని తెలంగాణ గీతంగా మార్చుతామని.. టీఎస్‌
కోడ్‌ ను టీజీగా మార్చుతామని.. రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
సుపరిపాలనతో మొదలుకుని రైతులు, యువత, వైద్యరంగాల సంక్షేమంతో పాటు పలు కీలకమైన అంశాలను ప్రధానంగా ప్రణాళికలో పేర్కొంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని, ప్రతీ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిజాం వారసత్వ సంపదగా భావించే ఉస్మానియా ఆసపత్రిని కాపాడుకుంటామని పేర్కొంది.
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌, కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం, ఉద్యమం సమయంలోని కేసులన్నీ ఎత్తివేత, పంటలకు మద్దతు ధర, ఐదువేల కోట్లతో ధరల స్థీరీకరణ, అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ఎన్‌ఆర్‌ఐ పాలసీ, గల్ఫ్‌ కార్మికులకు ఐదు వందల కోట్లతో సంక్షేమ నిధి, అన్ని జిల్లాలలో అమరవీరుల స్థూపాలు, నిరుద్యోగులకు మూడువేల భృతి, మైనార్టీలకు సబ్‌ ప్లాన్‌ తదితర అంశాలను చేర్చారు. తాము అధికారంలోకి రాగానే  మెగా డీఎస్సీతో పాటు, మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హావిూ ఇచ్చింది. మంగళవారం 35 అంశాలతో 112 పేజీల కాంగ్రెస్‌ ప్రజా మేనిఫెస్టోను విడుదల చేసింది. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేష్‌, కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దాసోజ్‌ శ్రవణ్‌, బండ్ల గణెళిశ్‌ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు దాసోజ్‌ శ్రవణ్‌ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను వెల్లడించారు.
కాంగ్రెస్‌ పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తామని ప్రకటించారు. అలాగే  ఉద్యమకారుల అందరిపైనా కేసులు ఎత్తివేస్తామన్నారు.  ఒకే దఫా రూ.2లక్షల రుణమాఫీ అమలు చేస్తాం.  పంటలకు మద్దతు ధర అందిస్తాం.  రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ, నిరుద్యోగులకు రూ.3వేల భృతి అందిస్తాం.  ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని వారసత్వం సంపదగా గుర్తిస్తామని అన్నారు.  వ్యవసాయ బ్జడెట్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.  అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పాత బకాయిలను చెల్లిస్తాం.  100శాతం అక్షరాస్యత సాధించాలని లక్ష్యం.  విద్యార్థులందరికీ బోధన రుసుం చెల్లింపు చేపడతాం.  అన్ని వ్యాధులకు రూ.5లక్షల వరకూ ఆరోగ్యబీమా అందజేస్తాం అని వివరించారు.  ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 1000 పడకల వైద్యశాల ఏర్పాటు చేస్తాం.   సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఆర్థిక సాయం చేస్తాం.
అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ అందిస్తామని వివరించారు.