Tuesday, 3 November 2026

తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం

3
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ

కేంద్రమంత్రి ఉమాభారతి

పార్లమెంట్‌లో మంత్రితో కెసిఆర్‌ భేటీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌8 (జనంసాక్షి) : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సోమవారం పార్లమెంట్‌కు చేరుకుని కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు. అదేవిధంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, తెలంగాణకు ప్రత్యేక ¬దా, పన్ను ప్రోత్సహకాలు, అధికారుల పంపకాలు సహా పలు అంశాలను శాఖల వారీగా కేంద్ర మంత్రులను కలిసి కెసిఆర్‌ మరోసారి గుర్తు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, రైల్వేమంత్రి సురేశ్‌ ప్రభుత తదితరులకు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కెసిఆర్‌ వివరించారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా ముందుకెళుతోందని, రాష్ట్రానికి కేంద్ర జలవనరుల శాఖ పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్‌తో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ, ప్రాణహిత-చేవెళ్ల, దేవాదులపై చర్చించామని, చర్చకు వచ్చిన అంశాలపై సానుకూల దృష్టితో ఉన్నామని ఉమాభారతి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర శాఖలు అధికారులు సమావేశమై చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి చర్యలపై ఆమె సానుకూలంగా స్పందించారు. ఆయన విధానాలతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, తద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తగినన్ని నిధులు ఇస్తామని చెప్పారు. ఈ విషయమై కేంద్రప్రభుత్వంతో చర్చిస్తామని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *