
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు హల్‌చల్ సృష్టించాడు. సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడితో మాట్లాడి కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. యువకుడిని వరంగల్ జిల్లాకు చెందిన రైతు కుమారుడిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ అసెంబ్లీ వద్ద సెల్‌టవర్ ఎక్కిన యువకుడు




