Monday, 2 November 2026

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

159

హైదరాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణ ప్రజానీకానికి అత్యంత కీలకం, శుభప్రదమైన దసరా పర్వదినం రోజున ఆరంభమయ్యే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవాల్లో ప్రజలు కూడా పాల్గొని దీవించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మంగళవారం దసరా పండగ సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ”దసరానాడు అతిపెద్ద పాలనా సంస్కరణల అమలు ఆరంభం కావటం శుభ సూచకం. ఈసారి మంచి వానలు పడటంతో మిషన్‌ కాకతీయ ద్వారా బాగుపడిన చెరువులు నిండాయి. నీటి అలలపై బతుకమ్మలు నాట్యమాడిన అద్భుత సన్నివేశాలు తెలంగాణ అంతటా కన్పించాయి. అదే స్ఫూర్తి, ఉత్సాహంతో ప్రజలంతా దసరా పండగ జరుపుకోవాలి. మంచి వర్షాలు కురవటంతో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. రబీ పంటల కోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతుల డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా అందించటానికీ ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యంత ఆశావహ దృక్పథం తెలంగాణలోని అన్నివర్గాల్లో ఉంది. భగవంతుడు కూడా తెలంగాణను ఆశీర్వదిస్తున్నాడు. ప్రజలు కూడా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఆరంభంలో పాల్గొని దీవించాలి” అని ముఖ్యమంత్రి కోరారు. జమి చెట్టు పూజ, రావణాసురవధ, పాలపిట్ట దర్శనం తదితర సంప్రదాయ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *