కొంగన్‌కలాన్‌వైపే
– సభ ఏర్పాట్లు చూసి ప్రతిపక్షాల కడుపు మండుతుంది
– 60ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించాం
– ఎప్పుడు ఎన్నికలొచ్చినా 100సీట్లు టీఆర్‌ఎస్‌వే
– ప్రజాధనం దుర్వినియోగం అంటున్న నేతలు కంటివెలుగు పరీక్షలు చేయించుకోవాలి
– మంత్రి నాయిని నర్సింహారెడ్డి
– సభకు పాదయాత్రగా బయల్దేరిన ప్రైవేట్ ఉద్యోగులు
హైదరాబాద్, ఆగస్టు1(జనం సాక్షి ) : తెలంగాణలోని ప్రజానీకం అంతా ప్రగతి నివేదిక సభ జరుగుతున్న కొంగర్ కలాన్ కు పయనమయ్యారని రాష్ట్ర శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. శనివారం తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ సామా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ చందానగర్ నుంచి కొంగర కలాన్ కు బయలుదేరిన 3000 మంది ప్రైవేటు ఉద్యోగుల పాదయాత్రను నాయిని ముఖ్య అతిథిగా వచ్చి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలుస్తుందని నాయిని స్పష్టం చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లను చూసి ప్రతిపక్షాల కడుపు మండుతోందని పేర్కొన్నారు. అరవై ఏళ్ళలో జరగని అభివృద్ధిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగు సంవత్సరాల్లోనే చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. బహిరంగ సభ వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తప్పుడు కూతలు కూస్తున్న ప్రతిపక్షాలకు ముందుగా కంటి వెలుగు సెంటర్ లలో కంటి పరీక్షలు నిర్వహించాలని వ్యాఖ్యానించారు. చందానగర్ నుండి మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రింగ్ రోడ్డు విూదుగా కొంగర కలాన్ వరకు ఈ పాదయాత్ర సాగుతుందని నిర్వాహకులు సామా వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నగర మేయర్ రామ్మోహన్ సతీమణి శ్రీదేవి, కార్పోరేటర్లు జగదీశ్వర్ గౌడ్, మేకా రమేష్, బొబ్బ నవతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజానీకం మొత్తం..




