హైదరాబాద్ (జనంసాక్షి)
ప్రతిపక్షనేత జానారెడ్డి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు. గతపాలకులు చిత్తశుద్ధితో ఏ ప్రాజెక్టుపై పనిచేయలేదన్నారు. నాగార్జునసాగర్ మొదలు ప్రాణహిత చేవెళ్ల వరకు అన్ని ప్రాజెక్టులను ఆంధ్రాపాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. చెన్నారెడ్డి హయాంలో మాత్రమే తెలంగాణకు కొద్దిగా న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై రీ ఇంజనీరింగ్ జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత శాసనసభ్యులందరం కూర్చోని ప్రాజెక్టుపై చర్చిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షసభ్యులకు సూచించారు.





