ఇంజినీరింగ్ విద్యా ప్రమాణాలను పెంపొందిస్తాం
ఇంజినీరింగ్ విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానమిచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో మౌళిక వసతలకు సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు చేశామని చెప్పారు. అందులో భాగంగా 16 ప్రైవేటు కాలేజీలపై క్రిమినల్ కేసులు పెట్టామని చెప్పారు. తప్పుడు సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వం, న్యాయస్థానం, జేఎన్టీయూలను కాలేజీలు తప్పుదోవ పట్టించాయని డిప్యూటీ సీఎం తెలిపారు.