దేశంలోనే ఉత్తమం
సర్కార్ వైద్యాన్ని గుడ్డిగా విమర్శించడం సరికాదు
స్వయంగా చూసిన తరువాతనే ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా
త్వరలోనే బస్తీ దవాఖానాలను పరిశీలిస్తా
గవర్నర్ నర్సింహన్
నారాయణగూడ డయాగ్నొస్టిక్ సెంట్రల్ ల్యాబ్‌ను పరిశీలించిన గవర్నర్
హైదరాబాద్ , జూన్21(జనం సాక్షి) : తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ దేశంలోనే ఉత్తమంగా పనిచేస్తుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ అన్నారు. గురువారం నారాయణగూడ ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంట్రల్ ల్యాబ్‌ను గవర్నర్ నరసింహన్, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ల్యాబ్‌ను పరిశీలించిన అనంతరం డయాగ్నొస్టిక్ సెంట్రల్ ల్యాబ్‌పై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ప్రతీ ఒక్కరికీ ల్యాబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతీ ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన గవర్నర్.. త్వరలోనే బస్తీ దవాఖానాలను కూడా పరిశీలిస్తానని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ దేశంలోనే ఉత్తమమైందని కితాబిచ్చారు. సర్కార్ వైద్యాన్ని గుడ్డిగా విమర్శించడం సరికాదని గవర్నర్
అన్నారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు పరిశీలించిన తర్వాతనే విమర్శించాలని గవర్నర్ సూచించారు. మార్చురీల విషయంలో కూడా కొన్ని మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇకపై సర్కార్ దవాఖానాలపై బ్రేకింగ్ న్యూస్ ఏవీ ఉండవని భావిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. నిజంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వ పనితీరును స్వయంగా పరిశీలించే అభినందిస్తున్నాని గవర్నర్ స్పష్టం చేశారు. గవర్నర్ ఏం చేసినా తప్పు అన్నట్టు ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ గుడికి పోయినా రాద్ధాంతం చేస్తున్నారని నరసింహన్ ఆగ్రహం వెలిబుచ్చారు.
మల్కాజ్‌గిరిలోని బస్తీ దవాఖానను పరిశీలించిన గవర్నర్..
రాష్ట్ర గవర్నర్ నరసింహన్, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మల్కాజ్‌గిరిలోని బస్తీ దవాఖానను గురువారం మధ్యాహ్నం సందర్శించారు. అక్కడ ఓపీ గది, ఫార్మసీతో పాటు తదితర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్బంగా గవర్నర్ బీపీ చెక్ చేయించుకున్నారు. దవాఖానకు చికిత్స కోసం వచ్చిన సత్తిరెడ్డి కాలనీకి చెందిన సులోచనతో గవర్నర్ మాట్లాడారు. విూ సమస్య ఏమిటి? ఏ మందులు వాడుతున్నారు? చికిత్స ఎలా ఉంది? అంటూ ఆమెను గవర్నర్ ప్రశ్నించారు. ఈ దవాఖానల్లో వైద్యం బాగుందని.. డాక్టర్లు తక్షణమే స్పందిస్తున్నారని ఆమె గవర్నర్‌కు వివరించారు. ప్రశాంతంగా జీవించాలని, ఎక్కువగా ఆలోచించి అనారోగ్యాలు తెచ్చుకోవద్దని సులోచనకు నవ్వుతూ గవర్నర్ చెప్పారు. స్థానిక కార్పొరేటర్‌తో మాట్లాడిన గవర్నర్.. తరుచూ బస్తీ దవాఖానాలను సందర్శించాలని, బాగా పని చేసే విధంగా సహకరించాలని సూచించారు. బస్తీ దవాఖాన నిర్వహణ తీరువిూద సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్.. మంత్రి లక్ష్మారెడ్డి, వైద్యారోగ్య శాఖ సిబ్బందినని అభినందించారు.
తెలంగాణ వైద్యారోగ్య శాఖ పనితీరు..




