తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం
అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 12.9 సెంటీవిూటర్ల వర్షపాతం
హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో చిరుజల్లులు పడ్డాయి. ఉదయం నుంచే ముసురు పట్టింది. ఆకాశం మేఘావృతమై జల్లుల పడుతున్నాయి. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో 12.9 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా పుట్టపహాడ్‌లో 11.5 సెంటీవిూటర్లు, సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టాలో 10.7 సెం.విూ, జనగామ జిల్లా బచ్చన్నపేటలో 9.9 సెం.విూ, మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో 9.2 సెం.విూ, కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌లో 8.6 సెం.విూ, భద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.విూ వాన పడిరది. కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్‌లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.