హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీపీఎం రాష్ట్ర మహాసభలు ఆదివారం ప్రారంభమాయ్యాయి. ఈ మహాసభలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు ప్రకాశ్ కారాట్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక అంశాలతో పాటు భౌతిక, భావజాల రంగాల్లోనూ సామాజిక ఉద్యమాలు నిర్మించే అంశంపై ఈ సభల్లో తీర్మానాలు చేయనున్నారు.




