తైపీ ఆస్పత్రిలో అగ్రిప్రమాదం: 9మంది మృతి

న్యూ తైపి,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): తైవాన్‌లోని ఓ హాస్పటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. న్యూ తైపి సిటీలో ఉన్న ఓ ఆస్పత్రి ఏడవ ఫ్లోర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో 16 మంది గాయపడ్డారు. ఇందులో పేషెంట్లతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. గాయపడ్డ చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఏ కారణం చేత అగ్ని ప్రమాదం జరిగిందో ఇంకా తెలియలేదు. విద్యుత్తు షాక్‌ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.