సొంత ఆస్తులను పెంచుకుంటున్న బాబు
అదే ఆయన పాలనా సామర్థ్యం
విూడియా సమావేశంలో మండిపడ్డ ఎంపి విజయసాయి
విశాఖపట్టణం,ఆగస్ట్13(జనం సాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం రాష్ట్రాన్ని ఊబిలోకి నెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. సోమవారం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఆస్తులు పెంచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేవిూ లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీ అవుతున్న గజదొంగ చంద్రబాబు నాయుడని విమర్శించారు. అవసరాల కోసం ఏ పార్టీతోనైనా లాలూచీ పడే వ్యక్తిత్వం చంద్రబాబుదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకర్ కోడెల శివప్రసాద్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రచారం కోసం ఖర్చు చేసిన రూ.వందల కోట్లుతో ఎన్నో గ్రామాలను శాశ్వతంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.చంద్రన్న బాట పేరుతో సిమ్మెంటు రోడ్లు నిర్మాణానికి రూ.కోట్లు దుర్వినియోగంచేశారని, ఆనేక గ్రామాల్లో వీధిరోడ్లు బాగాలేక ఇప్పటికీ నడవలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దత్తత పేరిట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆధికార పార్టీ నాయకులు హడావుడి చేశారని, ఇప్పుడు ఆయా గ్రామాల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ప్రజల బాగుకోసం, గ్రామాభివృద్ధి కోసం నిరంతరం తపించే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటుతో టీడీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.