కాబూల్ : అఫ్గన్ రాజధాని కాబూల్ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా రక్షణశాఖ కార్యదర్శి హెగెల్ కాబూల్ పర్యటనకు వచ్చిన సందర్భంలోనే ఆత్మాహుతిదాడి జరగడం గమనార్హం. రక్షణశాఖ కార్యలయం ప్రవేశద్వారంలో ఆత్మాహుతి సభ్యుడు సైకిల్ డూసుకువచ్చి గేటును ఢీకొనడంతో జరిగిన భారీ పేలుడులో తొమ్మిదిమంది చనిపోయారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.




