త్వరలో తెలంగాణపై స్పష్టత

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై అస్పష్టతకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెరదించనున్నారు. ఇవాళ జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో స్వయంగా ఆయనే తెలంగాణ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. వచ్చే నెల మొదటివారంలో తెలంగాణ అంశంపై కూడా స్పష్టత ఇద్దామని ఆయన సభ్యులకు చెప్పినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోపు కేంద్రానికి మరోమారు లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం.