Wednesday, 4 November 2026

సీపీఎం ఆరెళ్ల వ్యవధిలో 417 కోట్ల ఆదాయం

నూఢిల్లీ: సీపీఎం 2005 నుంచి ఆరెళ్ల వ్వవధిలో రూ. 417 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అందులో కార్పొరేట్‌ సంస్థలు సొసైటీల ద్వారా వచ్చిన విరాళాలు కేవలం కోటిన్నర రూపాయలు. పార్టీలో పూర్తి పారదర్శకత తెచ్చే ప్రయత్నంలో భాగంగా సీపీఎం తన ఆదాయ వివరాల తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు పార్టీ వెబ్‌సైట్లో పెట్టాలని నిర్ణయించింది. తాము తాజాగా వెబ్‌సైట్లో పొందుపరచనున్న వివరాలను అన్నిటినీ ఎప్పటి నుంచో ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల సంఘానికి ఇస్తున్నట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *